హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాలకు ఈ నెల 13, 14 తేదీల్లో వాటర్సప్లయ్ఉండదని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. మంజీరా ప్రాజెక్టు ఫేజ్–2 పరిధిలోని కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న 1,500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు పలు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. 13న ఉదయం 6 గంటల నుంచి 14 ఉదయం 6 గంటల వరకు వాటికి సంబంధించిన రిపేర్లు జరుగుతాయి.
ఆ టైంలో ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, బోరబండ, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, నిజాంపేట, హైదర్‌నగర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, హఫీజ్‌పేట, బీరంగూడ, అమీన్‌పూర్, బొల్లారం ఇండస్ట్రియల్ఏరియా తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.