
హైదరాబాద్సిటీ, వెలుగు: బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర నేషనల్హైవే అథారిటీ ఆఫ్ఇండియా ఫ్లై ఓవర్ నిర్మిస్తోంది. ఆ పనులకు ఆటంకం కలగకుండా అక్కడున్న వాటర్ బోర్డు పీఎస్సీ పైపులైన్ ను వేరే చోటికి మారుస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనులు కొనసాగనున్నాయి.
ఆ టైంలో ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తిశ్రీనగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.