ఐ యాం సారీ.. రాజ్యాంగ విరుద్ధమైన పార్టీకి విషెష్ చెప్పను: మమతా బెనర్జీ 

ఐ యాం సారీ.. రాజ్యాంగ విరుద్ధమైన పార్టీకి విషెష్ చెప్పను: మమతా బెనర్జీ 

బీజేపీకి శుభాకాంక్షలు చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన బీజేపీ పార్టీకి నేను శుభాకాంక్షలు చెప్పను అని మమతా తెగేసి చెప్పారు. 

బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ.. ఎంతకాలం ప్రభుత్వం నడుపుతుందో చూద్దాం అని అన్నారు. కేంద్రంలో అస్థిరమైన బలహీనమైన బీజేపీ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి మెజారిటీ లేదు.. మిత్రపక్షాలపై ఆధారపడి ఉంది. ఎంత కాలం తమ మిత్ర పక్షాలతో కలిసి ఉంటారో చూద్దాం అని అన్నారు మమతా బెనర్జీ. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి టీఎంసీ హాజరుకాదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.