ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్డేట్‌‌‌‌‌‌‌‌ కోసం ఆందోళన వద్దు : కలెక్టర్ యస్మిన్ బాషా

కోరుట్ల రూరల్​, వెలుగు:  ప్రజాపాలన దరఖాస్తుల కోసం ఆధార్ కార్డు అప్డేట్, గ్యాస్ కనెక్షన్  కేవైసీ ఎంట్రీ ఇప్పడు అవసరం లేదని...  రిఫరెన్స్ కోసం ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ యస్మిన్ భాషా తెలిపారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  ఆమె మాట్లాడుతూ ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వద్దకు, కేవైసీ ఎంట్రీ చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. రిఫరెన్స్ కోసం ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా దరఖాస్తుకు జత చేయాలన్నారు.  ఒక కుటుంబం నుండి ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలని ఆమె తెలిపారు.  కలెక్టర్ తో పాటు కోరుట్ల ఆర్డీవో రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.