ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

2024 సంవత్సరానికి గానూ అర్ధ శాస్త్రంలో  ముగ్గురిని నోబెల్ అవార్డు వరించింది. ఆర్థిక వేత్తలు డారెన్ ఏస్ మోగ్లు, సిమోన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్ సన్‎కు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ ముగ్గురిని నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024, అక్టోబర్ 14న అవార్డ్ విజేతల పేర్లను ప్రకటించింది. ఆల్ఫ్రైడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10వ తేదీన స్వీడన్‎లోని స్టాక్ హోమ్‎లో విజేతలకు అవార్డు ప్రదానం చేయనున్నారు. 

విజేతలకు అవార్డ్‎తో పాటు1.1 మిలియన్ డాలర్ల నగదు బహుమతి కూడా అందించనున్నారు. కాగా, 2024 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన కొనసాగుతోంది.  ఇప్పటికే వైద్య, రసాయన, భౌతిక, సాహిత్యం, శాంతి రంగాలకు చెందిన విజేతల పేర్లను నోబెల్ సెలక్షన్ కమిటీ ప్రకటించగా.. తాజాగా ఇవాళ (అక్టోబర్ 14) అర్ధ శాస్త్రానికి చెందిన అవార్డ్ విన్నర్ల పేర్లను అనౌన్స్ చేసింది. దీంతో ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన ముగిసింది.