ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జపాన్ సంస్థ 'నిహాన్ హిడాంకియో' గెలుచుకుంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను జపాన్ సంస్థను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
1945, ఆగష్టు 6, 9వ తేదీలలో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు వేసిన వేసిన విషయం తెలిసిందే. ఈ అణుదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు నిహాన్ హిడాంకియో సంస్థను ప్రారంభించారు. 1956లో ఈ సంస్థ ఏర్పాటైంది.
Also Read :- సచిన్ రికార్డ్ రూట్ బ్రేక్ చేయడం నేను చూస్తాను
అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని నిహాన్ హిడాంకియో సంస్థ కోరుకుంటున్నట్లు నార్వేయన్ నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది. న్యూక్లియర్ ఆయుధాలను మళ్లీ వాడరాదని ఆ సంస్థ ప్రత్యక్ష బాధితులతో ప్రదర్శనలు ఇచ్చినట్లు కమిటీ పేర్కొంది.
Breaking news: The #NobelPeacePrize 2024 is awarded to the Japanese organisation Nihon Hidankyo 🕊️ Congratulations! pic.twitter.com/M13o0F0KIq
— Nobel Peace Center (@NobelPeaceOslo) October 11, 2024
నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి ప్రధానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 104 సార్లు నోబెల్ శాంతి పురస్కారాన్ని అందించారు. వ్యక్తులతో పాటు సంస్థలను నోబెల్ శాంతి బంహుమతికి ఎంపిక చేస్తారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన వారిలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి ప్రముఖులు ఉన్నారు.