డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ పీస్ ప్రైజ్‌‌

  • 2021 ఏడాదికి నామినేట్ చేసిన నార్వే ఎంపీ

ఓస్లో (నార్వే): ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ కు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరును సూచిస్తూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి నామినేషన్ అందింది. నోబెల్ పీస్ ప్రైజ్ 2021 నామినీల లిస్టులో ట్రంప్ తో పాటు స్వీడిష్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్, రష్యన్ అపొజిషన్ లీడర్ అలెక్సీ నవాల్నీ, తదితరుల పేర్లు ఉన్నాయి. ట్రంప్ పేరును నార్వే పార్లమెంట్ మెంబర్, ప్రోగ్రెస్ పార్టీ నేత ఒకరు నామినేట్ చేశారు. గతేడాది కూడా ట్రంప్ పేరును పీస్ ప్రైజ్ కు నామినేట్ చేశారు. రష్యాలో పీస్ ఫుల్ డెమోక్రటైజేషన్ కోసం కృషి చేస్తున్నందుకు గాను అలెక్సీ నవాల్నీని నార్వే మాజీ మంత్రి ఓలా ఎల్వెస్టీన్ నామినేట్ చేశారు. ఫెయిర్ ఎలక్షన్ కోసం పోరాడిన బెలారసియన్ యాక్టివిస్టులు స్వెత్లానా సిఖనౌస్కయా, మరియా కొలెస్నికోవా, వెరోనికా సెప్కలో, చార్లీ హెబ్డీ మాజీ జర్నలిస్ట్ జినెబ్ ఎల్ రజోయ్ పేర్లు కూడా నామినీల లిస్టులో ఉన్నాయి. ఇక సంస్థల విషయానికి వస్తే.. పేద దేశాలకూ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కొవ్యాక్స్ ప్రోగ్రాంను స్టార్ట్ చేసినందుకు డబ్ల్యూహెచ్ వోను, అమెరికాలో నల్లజాతి ప్రజల కోసం ఉద్యమం ప్రారంభించిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ సంస్థ కూడా నామినేట్ అయ్యాయి. వీటితో పాటు నాటో, యూఎన్ రెఫ్యూజీస్ ఏజెన్సీ (యూఎన్ హెచ్ సీఆర్), యూఎస్ కు చెందిన కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌‌,  ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్​వర్క్,  హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ న్యూస్ వెబ్ సైట్, పారిస్ లోని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) సంస్థలు కూడా నామినేట్ అయ్యాయి.

For More News..

అప్పుడేమో పాస్ చేస్తమన్నరు.. ఇప్పుడేమో పరీక్ష రాయాలంటున్నరు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే స్టడీ లోన్స్

జనవరిలో మనోళ్లు మస్తు తాగిన్రు.. ఒక్క నెలలోనే లిక్కర్ సేల్స్ 2,633 కోట్లు