2024 సంవత్సరానికిగానూ నోబెల్ అవార్డుల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం (2024, అక్టోబర్ 8) వైద్య రంగానికి చెందిన అవార్డ్ విజేతల పేర్లను అనౌన్స్ చేయగా.. ఇవాళ (2024, అక్టోబర్ 9) భౌతిక శాస్త్రానికి సంబంధించిన అవార్డులను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తలు జె.హోప్ ఫీల్డ్, జెఫరీ హింటన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లలో మెషీన్ లెర్నింగ్‌ను ఎనేబుల్ చేసే ఆవిష్కరణలకు సంబంధించి విశేష కృషి చేసింనందుగానూ జె.హోప్ ఫీల్డ్, జెఫరీ హింటన్‌ను నోబెల్ అవార్డ్ వరించింది. అవార్డు విజేతలు 1.1 మిలియన్ల డాలర్ల క్యాష్ ప్రైజ్ అందుకోనున్నారు. ఆల్ఫైడ్ర్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డ్‌ను ప్రదానం చేయనుంది.
ALSO READ | మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునేందుకు భారత్ముందుంటది: ప్రధానిమోదీ
కాగా, ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం మెడిసిన్ విభాగానికి సంబంధించిన విజేతల పేర్లనే నోబెల్ సెలక్షన్ కమిటీ మొదటి ప్రకటించింది. తర్వాత సైన్స్, సాహిత్యం, ఆర్థిక, శాంతి రంగాలకు సంబంధించి విజేతల పేర్లను అనౌన్స్ చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఫిజిక్స్ కేటగిరీకి చెందిన అవార్డు విన్నర్ల పేర్లను కమిటీ అనౌన్స్ చేసింది. అక్టోబర్ 14వ తేదీ వరకు అవార్డుల ప్రకటన కొనసాగనుంది. స్వీడిష్ కు చెందిన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా 1901 నుండి ప్రతి సంవత్సవరం నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తోన్న విషయం తెలిందే.
ప్రపంచవ్యాప్తంగా వైద్యం, సైన్స్, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు నోబెల్ అవార్డులు ఇస్తున్నారు. తర్వాత ఆర్థిక రంగంలో కూడా ఈ అవార్డ్‌ను అందజేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఐదు రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోమ్‌లో విజేతలకు అవార్డులను ప్రధానం చేస్తారు. అయితే శాంతి రంగానికి చెందిన అవార్డ్‌ను మాత్రం స్టాక్ హోమ్‌లో కాకుండా ఓస్లోలో విజేతకు అందజేస్తారు.