హైదరాబాద్: కొన్ని విభాగాల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తెలిపారు. ప్రజావాణి కు మహిళలు, నిరుద్యోగులు, ఇళ్లు లేని వారి అధికంగా సంఖ్య లో క్యూ కడుతున్నారు. దీంతో వారి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చెయ్యాలని నోడల్ ఆఫీసర్ దివ్య నిర్ణయించారు వచ్చే వారం నుంచి మరో 10 విభాగాలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక కౌంటర్ల ను ప్రజా వాణి లో ఏర్పాటు చేయబోతున్నామని దివ్య వెల్లడించారు.
భూ కబ్జా, డబల్ బెడ్ రూం ఇళ్లు, గృహ హింస,తదితర సమస్యలకు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తుండటంతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.