పంజాగుట్ట, వెలుగు: ప్రజావాణిలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న యువకుడికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నోడల్ఆఫీసర్ దివ్య దేవరాజన్శుక్రవారం ఎలక్ట్రికల్ ఆటోను అందజేశారు. ప్రజాభవన్‌లో మూడు వారాల క్రితం ఎర్రగడ్డకు చెందిన మేదరి అశోక్ స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజావాణి ఆఫీసర్లు అతడి దరఖాస్తును ఎస్పీ కార్పొరేషన్‌కు పంపారు. దీంతో సబ్సిడీ ద్వారా మంజూరైన ఆటోను ప్రజావాణిలో అశోక్‌కు అందజేశారు. ఆటోలో చిన్నారెడ్డి, నోడల్ఆఫీసర్ దివ్య ప్రయాణించారు.
ప్రజావాణికి 422 దరఖాస్తులు
ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి శుక్రవారం 422 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వాటిలో మైనారిటీ వెల్ఫేర్‌కు 145, పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 85, విద్యుత్‌శాఖకు 53, రెవెన్యూ సమస్యలకు సంబంధించి 68, హోంశాఖకు 53, ప్రవాసీ ప్రజావాణికి 4, ఇతర శాఖలకు చెందినవి 52 ఉన్నాయి.