
కొడంగల్, వెలుగు : ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి కృష్ణన్ ప్రజలకు సూచించారు. గురువారం కొడంగల్ మండల పరిధిలోని చెట్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాలు ప్రత్యేక అధికారి కృష్ణన్ పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అర్హులు మాత్రమే ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు అందరికీ ఉచితంగా అందిస్తామన్నారు. ఇందిరమ్మ అభయ హస్తం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో పాండు, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.