కాకుల్లా వేధింపులు.. నీచాతినీచంగా అవమానాలు.. బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య

కాకుల్లా వేధింపులు.. నీచాతినీచంగా అవమానాలు.. బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య

బ్యాంక్ ఉద్యోగం అంటే వైట్ కాలర్ జాబ్ అనుకుంటారు.. అందులో పని చేసే ఉద్యోగులు అందరూ ఒకేలా ఉండరు.. కిరాతకులు ఉంటారు.. నీచాతి నీచులూ ఉంటారు.. వెధవలు ఉంటారు.. వెధవన్నర వెధవులూ ఉంటారు అనేది ఈ ఘటనతో నిర్థారణ అయ్యింది. నోయిడాలోని ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న 27 ఏళ్ల యువతి ఆత్మహత్య.. ఆమె రాసిన సూసైడ్ నోట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం... శివాని గుప్త, నోయిడాలోని ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో రిలేషన్షిప్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యింది.ఉద్యోగం సాఫీగా సాగుతోంది అనుకున్న సమయంలో కొలీగ్స్ నుండి వేధింపులు మొదలవ్వటంతో భరించలేక, ఇంట్లో చెప్పుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

శివాని కొలీగ్స్ ఆరు మంది తనను వేధించేవారని, విడాకుల విషయాన్ని పదేపదే ప్రస్తావించి వేధించేవారని సూసైడ్ నోట్ లో తెలిపింది. అంతే కాకుండా తనను కోతి అని పిలుస్తూ వేధించేవారని పేర్కొంది. తనని వేధించిన వారిలో ఇద్దరు మేనేజర్లు కూడా ఉన్నట్లు తెలిపింది శివాని.ఆరు నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా హింసించే వారని, వారి వేధింపులు తాళలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది శివాని.

కొలీగ్స్ వేధింపుల వల్ల డిప్రెషన్ కి గురయ్యి, పలు మార్లు సైకియాట్రిస్ట్ ను కూడా కలిసినట్లు తెలిపింది. జూన్ 29న కొలీగ్స్ తో కలిసి ఆఫీస్ దగ్గర్లో ఉన్న రెస్టారెంట్లో లంచ్ కి వెళ్లిన సమతంలో గొడవ అయ్యిందని, ఆ తరువాత జూలై 9న తనపై భౌతిక దాడికి దిగారని పేర్కొంది. ఈ విషయం గురించి కంప్లైంట్ చేసినప్పటికీ సీనియర్స్ తన కొలీగ్స్ కే సపోర్ట్ చేసి తనపై యాక్షన్ తీసుకునేలా చేశారని తెలిపింది.ఈ విషయాన్ని ఇంట్లో పంచుకోలేక మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్య చేసుకుంది శివాని.

ఈ ఘటనపై శివాని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇందుకు కారణమైన శివాని కొలీగ్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శివాని సోదరుడు.శివాని మృతిపై స్పందించిన బ్యాంకు యాజమాన్యం తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శివాని సూసైడ్ నోట్ ను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కి పంపి, కొలీగ్స్ నుండి వాంగ్మూలం తీసుకొని విచారణ ముమ్మరం చేశారు.