టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ రాత్రంతా శనగలు ఉడికించి.. నిద్రలోనే చనిపోయారు. మరుసటి రోజు కోసం రాత్రంతా ఛోలే భతూర్ (chhole bhature) (పూరీ, శనగల కర్రీ టిఫిన్), కుల్చె (పరోట, శనగల కర్రీ టిఫిన్) తయారు చేయడానికి కాబూల్ శనగలు ఉడికించారు. శనగలు ఉడికిస్తున్న సమయంలో.. అలసటతో స్టవ్ ను ఆపడం మర్చిపోయారు. స్టవ్ తెల్లవార్లు వెలుగుతూనే ఉంది.. కానీ ఇద్దరు నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషాద ఘటన నోయిడాలో జరిగింది.
ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడా లోని బసయిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఉపేంద్ర(22), శివమ్(23) ఇద్దరు స్నేహితులు.ఉపాధి కోసం రోజు టిఫిన్ సెంటర్ నడుపుతుంటారు. ఛోలే భతూర్, కుల్చె టిఫిన్స్ కోసం శనగ కర్రీ తయారు చేయడానికి కాబూల్ శనగలు ఉడికిస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. పొద్దంతా పనిచేసి అలసటతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నారు. స్టవ్ ఆఫ్ చేయలేదనే విషయం మర్చిపోయారు.
నోయిడా సెంట్రల్ జోన్ ఏసీపీ రాజీవ్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో రాత్రంతా శనగలు ఉడుకుతూనే ఉన్నాయి. తలుపులు, కిటికీలు మూసి ఉండటంతో.. రూమ్ అంతా ఆవిరి, పొగ వ్యాపించాయి. శెనగలు బాయిల్ అవుతున్నప్పు నీళ్లు లేకపోవడంతో మాడి పోయి.. కార్బన్ మోనాక్సైడ్ రూమంతా వ్యాపించింది. ఆక్సిజన్ తక్కువగా ఉండటం.. కార్బన్ మోనాక్సైడ్ వ్యాపించడంతో శ్వాస ఇబ్బందిగా మారి నిద్రలోనే చనిపోయారు’’ అని తెలిపారు.
ALSO READ | ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్ నగరాలు.. టాప్ 5 లో మూడు మనవే..
తెల్లవారిన తర్వాత చుట్టు పక్కల ఉన్న స్థానికులు ఇంట్లో నుంచి పొగలు రావడం చూసి.. ఎంత పిలిచినా పలకక పోవడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు యువకులను పరిశీలించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కార్బన్ మోనాక్సైడ్ చాలా విషపూరితమైన వాయువు. దీనికి వాసన ఉండదు. అందుకే వాళ్లు తెల్లవార్లు స్టవ్ ఆన్ లో ఉండి పొగ వ్యాపిస్తున్నా గుర్తించలేక పోయారు.
కార్లు, ట్రక్కులు, స్టవ్స్, ఓవెన్స్, గ్రిల్స్, జెనరేటర్స్ వంటివి మండించినపుడు విడుదల అవుతుంది. వాసన తెలియదు కాబట్టి గుర్తించడం కష్టం. అందుకే రాత్రుల్లో పడుకునే ముందు స్టవ్ ఆఫ్ చేశామా లేదా చెక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ లో ఏవైనా మండిస్తూ ఉండకూడదు.