New Year 2025: నోయిడా పోలీసులు హెచ్చరిక... కిక్కు ఎక్కువైతే.. క్యాబ్.. ఆటోల్లో ఇంటికి పంపిస్తాం..

New Year 2025:   నోయిడా పోలీసులు హెచ్చరిక...  కిక్కు ఎక్కువైతే.. క్యాబ్.. ఆటోల్లో ఇంటికి పంపిస్తాం..

ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఢిల్లీలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.  రాత్రి వేళ మద్యం సేవించి  జనాలకు ఇబ్బంది కలిగించకుండా పోలీసులు అద్దె క్యాబ్ లు ఏర్పాటు చేశారు. నోయిడాలో వివిధ మాల్స్, పబ్‌లు మరియు రెస్టారెంట్లలోని హెల్ప్‌డెస్క్‌ల వద్ద పోలీసులను మోహరిస్తారని అధికారులు  తెలిపారు. మద్యం తాగిన వారిని కార్లు... బైక్‌లు నడపనివ్వరు. దీనికోసం అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ కులకర్ణి  కొత్త సంవత్సర వేడుకల కోసం పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 

Also Read :- డిసెంబర్ 31 అర్దరాత్రి 12.30 వరకు మెట్రో సేవలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకొనే వారు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు.   ఎవరైనా మద్యం అతిగా సేవించి రచ్చ చేస్తే పోలీసులు క్యాబ్ లో ఇంటికి పంపుతారు.  ఇంకా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్ అండ్‌ రెస్టారెంట్ యజమానుల సహకారంతో నోయిడా పోలీసులు క్యాబ్, ఆటో సేవలను అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలను  సంతోషంగా.. ప్రశాంతంగా  జ‌రుపుకునేలా డ్రోన్ నిఘా, ప్రత్యేక క్యాబ్, ఆటో సేవలతో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు.