మైండ్ బ్లోయింగ్ ఐడియా : కుంభమేళా నీళ్లు స్విమ్మింగ్ పూల్ లో.. గేటెడ్ కమ్యూనిటీలో అందరూ పవిత్ర స్నానం

మైండ్ బ్లోయింగ్ ఐడియా : కుంభమేళా నీళ్లు స్విమ్మింగ్ పూల్ లో.. గేటెడ్ కమ్యూనిటీలో అందరూ పవిత్ర స్నానం

కొన్ని కొన్ని ఐడియాలు అద్భుతం.. మహా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఆలోచనే ఇది. కుంభమేళాకు వెళ్లిన ఓ కుటుంబం.. వస్తూ వస్తూ త్రివేణి సంగమం నుంచి రెండు వాటర్ బాటిళ్లలో నీళ్లు తీసుకొచ్చారు. ఈ రెండు వాటర్ బాటిళ్లు అందరికీ ఇవ్వలేరు కదా.. ఈ రెండు వాటర్ బాటిళ్లతోనే అందరూ పుణ్య స్నానం చేయాలంటే ఎలా అనే ఆలోచన చేశారు. అప్పుడు వచ్చింది వాళ్లకు ఆ ఐడియా.. ఈ రెండు వాటర్ బాటిళ్ల నీళ్లను ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కలిపారు. ఐడియా అదిరింది కదా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Also Read :- సముద్రపు కారు..3 గంటల్లో కోల్కతా నుంచి చెన్నైకు

దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడా ప్రాంతం. ATS సొసైటీ. ఇదో గేటెడ్ కమ్యూనిటీ.. కుంభమేళాకు వెళ్లి వచ్చిన ఓ కుటుంబం తీసుకొచ్చిన రెండు వాటర్ బాటిళ్ల త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలను.. గేటెడ్ కమ్మూనిటీలోని స్విమ్మింగ్ పూల్ లో కలిపారు. స్విమ్మింగ్ పూల్ లో కలిపే ముందు హర హర మహదేవా.. ఓం నమ: శివాయా అంటూ ప్రార్థనలు, పూజలు చేశారు. ఆ తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ లో గేటెడ్ కమ్యూనిటీలోని వాళ్లందరూ స్నానాలు చేశారు. రద్దీ కారణంగా కావొచ్చు.. ట్రాఫిక్ వల్ల కావొచ్చు.. మరో కారణంగా కుంభమేళాకు వెళ్లలేని వాళ్లకు ఇది మంచి ఐడియా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

ఇప్పటికే కుంభమేళాలో 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. వేల మంది డిజిటల్ స్నానం చేశారు. తమ ఫొటోలను పంపించిన త్రివేణి సంగమంలో వాటిని ముంచారు. ఇలా దేశవ్యాప్తంగా హిందూ భక్తులు అందరూ కుంభమేళా పవిత్ర స్నానాలను ప్రత్యక్షంగా.. పరోక్షంగా తమ భక్తిని చాటుకున్నారు. 

మహా కుంభమేళా పవిత్రతను.. పుణ్య స్నానాన్ని ఈ విధంగా అయినా ఆచరించటం అనేది మంచి ఐడియా.. కుంభమేళాకు వెళ్లలేని వారు ఈ ఐడియాను ఫాలో అవ్వాలి.. డిజిటల్ ఆర్డర్ చేసి.. త్రివేణి సంగమం నీళ్లను తెచ్చుకోవాలి.. అన్ని గేటేడ్ కమ్యూనిటీల్లో ఇలా చేయాలంటూ చాలా మంది నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం విశేషం. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.