నోయిడా : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో అక్కడ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు ఈ నెల 14 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అలాగే, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూళ్ల టైంను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కుదించారు.
విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శనివారం గౌతమ్ బుద్ధ నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నోయిడాలో చలి, ఇతర ప్రతికూల వాతావరణం కారణంగా డిసెంబర్‌లోనే స్కూళ్లను మూసివేశారు. ఈ నెల 1న రీఓపెన్ చేశారు.