
నోయిడాలో ఓ మహిళ ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చిందన్న వార్త రెండు రోజుల క్రితం నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క రావడంతో తన వ్రతం దెబ్బ తినిందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించటంతో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ( ఏప్రిల్ 7 ) రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
గత శుక్రవారం తాను ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చిందంటూ మహిళ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెస్టారెంట్ నిర్లక్ష్యం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. వ్రతం రోజున కూడా శుభ్రంగా ఇంట్లో వండుకోకుండా బయట ఫుడ్ ఆర్డర్ చేయడమేంటి అంటూ మరికొంతమంది నెటిజన్స్ సదరు మహిళకు కౌంటర్ ఇచ్చారు.
మరి.. రెస్టారెంట్ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇక్కడితో ఆపేస్తారా లేక విచారణ జరిపి సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.