
వానలు లేక ఇన్నాళ్లు వెలవెలబోయిన జలాపాతాల వద్ద మళ్లీ సందడి మొదలైంది. చత్తీస్‌గఢ్ గుట్టలు, అడవుల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని బొగత, కొంగాల, వెంకటాపురం మండలంలోని ముత్యాల జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి.
దీంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల నుంచి టూరిస్ట్‌లు కుటుంబ సమేతంగా వచ్చి జలపాతాల అందాలను వీక్షిస్తూ, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా టూరిస్ట్‌లు జలపాతాల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు దాటి వెళ్లొద్దని వాజేడు ఎస్సై అశోక్ సూచించారు. వెంకటాపురం, వెలుగు