
హెచ్‌ఎండీ గ్లోబల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నోకియా 3.2ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,990 కాగా, 3జీబీ ర్యామ్+32 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,790. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, స్టీల్ కలర్ ఆప్షన్లలో టాప్ మొబైల్ రిటైల్ స్టోర్లు, నోకియా.కామ్‌లలో మే 23 నుంచి అందుబాటులో ఉంటుంది. 6.26 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 429 చిప్‌సెట్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, గూగుల్ అసిస్టెంట్ బటన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ఫీచర్లు.