న్యూఢిల్లీ: 4 జీ, 5జీ నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్లను సప్లయ్ చేసే రూ.30 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌కు వొడాఫోన్ ఐడియా (వీ) ఇచ్చింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద టెలికం ఆర్డర్ కావడం విశేషం. వొడాఫోన్ ఐడియా రానున్న మూడేళ్లలో రూ.55 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తాజాగా భారీ ఆర్డర్‌ను టెలికం ఎక్విప్‌మెట్ తయారీ కంపెనీలకు ఇచ్చింది.
కంపెనీ తన 4జీ కవరేజ్‌ను విస్తరించాలనే ప్లాన్‌లో ఉంది. కీలక మార్కెట్లలో 5జీ సర్వీస్‌లను లాంచ్ చేయాలని చూస్తోంది. రానున్న క్వార్టర్లలో టెలికం ఎక్విప్‌మెంట్లను నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్ సప్లయ్ చేయడం మొదలు పెడతాయి. 120 కోట్ల మంది ప్రజలకు 4జీ సర్వీస్‌లను అందించడమే తమ లక్ష్యమని వొడాఫోన్ ఐడియా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.