హెచ్ ఎండీ నోకియా కంపెనీ పర్యావరణాన్ని రక్షించే బాద్యత తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు తీసుకొస్తోన్న నోకియా ఎక్స్ 30 5జీ స్మార్ట్ ఫోన్ ని100 శాతం రీసైకిల్ అల్యూమినియం, 65 శాతం రీసైకిల్ ప్లాస్టి్క్ తో తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఏడాది వారంటీని కూడా ఇస్తుంది.
6.43 ఇంచ్ ఆమోలెడ్ డిస్ ప్లేతో, 90 హెడ్జ్ రీ ఫ్రెష్ రేట్ తో రాబోతోంది. స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఐపీ67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కలిగి ఉంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించారు. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్స్ లో రాబోతోంది. ఫిబ్రవరి 20 నుండి అమెజాన్, నోకియా.కామ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.48,999.