నోకియా ఫోన్‌‌‌‌ చాలా టఫ్‌‌‌‌!

నోకియా ఫోన్‌‌‌‌ చాలా టఫ్‌‌‌‌!

కొందరు స్మార్ట్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ను చాలా రఫ్‌‌‌‌గా వాడుతుంటారు. తొందరగా పగిలిపోవడమో, పూర్తిగా పాడవడమో జరుగుతుంది. అలాంటివాళ్లకు ‘నోకియా 800 టఫ్‌‌‌‌’ మొబైల్‌‌‌‌ మంచి చాయిస్‌‌‌‌. నోకియా సంస్థ నుంచి విడుదలైన ఇది రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లా ఉండదు. ఎందుకంటే ఇది ఫుల్‌‌‌‌ టచ్‌‌‌‌స్క్రీన్‌‌‌‌ ఫోన్‌‌‌‌ కాదు. ఇది పాత మోడల్‌‌‌‌లాగా హాఫ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌, హాఫ్‌‌‌‌ బటన్స్‌‌‌‌ ఉన్న ఫోన్‌‌‌‌.

అయితే ఇది 4జి సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. పైగా వాటర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌ డస్ట్‌‌‌‌ ప్రూఫ్. ఐపీ 68 రేటింగ్‌‌‌‌ ఉంది. నీళ్లలో పూర్తిగా తడిచినా పాడవదు. ఎటువంటి డస్ట్‌‌‌‌ చేరదు. అలాగే కిందపడ్డా పగిలిపోకుండా స్పెషల్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌తో తయారు చేశారు. ఎక్కువ వేడిని కూడా తట్టుకోగలదు. ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, వాట్సాప్‌‌‌‌వంటి యాప్స్‌‌‌‌, గూగుల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, వై–ఫై హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌ను సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. కెమెరా, ఫ్లాష్‌‌‌‌లైట్‌‌‌‌ వంటి ఫీచర్లున్నాయి.