ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేసిందా.. అన్ని కంపెనీలపై ఆ ప్రభావం పడుతుందా అంటే.. నోకియానే ఎగ్జాంపుల్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. టెక్నాలజీ రంగంలో ఉన్న ఒడిదుడుకులతోపాటు.. సేల్స్ భారీగా తగ్గటంతో.. నోకియా అత్యంత వేగంగా.. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే.. నోకియా 5జీ టెక్నాలజీ పరికరాలకు సంబంధించిన అమ్మకాలు ఏకంగా 20 శాతం డౌన్ అయ్యాయి. దీంతో ఆదాయం పడిపోయింది.
కంపెనీ నష్టాలను గట్టెక్కించేందుకు, నికర ఆదాయంతోపాటు రిజర్వ్ నిధులను పెంచుకునే మార్గంలో భాగంగా.. కంపెనీ నుంచి 14 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది నోకియా. ప్రస్తుతం నోకియా కంపెనీలో 86 వేల మంది ఉద్యోగులు ఉండగా.. 14 వేల మంది తొలగింపుతో.. ఉద్యోగుల సంఖ్యను 72 వేలకు తీసుకురావాలని నిర్ణయించింది కంపెనీ. అందరూ ఐటీ రంగ నిపుణులే కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.
2024 ఏడాదికి 400 మిలియన్ యూరోలు, 2025 నాటికి మరో 300 మిలియన్ యూరోల నిధులను ఆదా చేయాలని.. అందుకు ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గం అని భావిస్తుంది కంపెనీ. ఈ క్రమంలోనే 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది.
ALSO READ : ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీల షాక్: కొత్త కుర్రోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేం..
నోకియా తొలగిస్తున్న 14 వేల మంది ఉద్యోగులు ఏ ప్రాంతం వారు.. అంటే అమెరికాలోనా.. ఇండియాలోనా.. లేక ఇతర దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులా అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. నోకియా నిర్ణయంతో మిగతా కంపెనీల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో సైతం ఆందోళన నెలకొంది.