నెలాఖరు వరకు నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల భర్తీ : పీసీసీ చీఫ్​ మహేశ్

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెలాఖరు వరకు ఖాళీగా ఉన్న నామినేటెడ్, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు, డీసీసీ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని చెప్పారు. 

కేబినెట్‌‌‌‌ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బుధవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌‌‌తో రాష్ట్ర ముఖ్యనేతల భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై కేసీ వేణుగోపాల్‌‌‌‌తో జరిగిన సమావేశంలో చర్చ జరిగిందన్నారు.