నల్గొండ అర్బన్, వెలుగు: నవంబర్ 3 నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఆర్‌వోలను ఆదేశించారు. సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ నామినేషన్ల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆర్‌వోలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్లలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, ఎఫ్ఎస్‌టీ, వీఎస్‌టీ, ఎక్స్‌పెండిచర్ బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ‘సువిధ’ ద్వారా అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవగాహన కల్పించాలని, సి -విజిల్ యాప్ గురించి ప్రచారం చేయాలన్నారు. పీవోలు, ఏపీవోలకు రెండో విడత శిక్షణలో పోలింగ్‌కు ముందు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్ల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ పోలీస్, ఎఫ్‌ఎఫ్‌టీ బృందాలు మద్యం, నగదు, వస్తువుల సరఫరా నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. స్పెషల్ కలెక్టర్ హరి సింగ్, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ కేశవ్, శ్రీనివాస్, ఆర్‌వోలు రవి, చెన్నయ్య, శ్రీ రాములు, దామోదర రావు పాల్గొన్నారు.