కరీంనగర్: హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ కొత్త కుట్రలకు తెరలేపిందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేరును పోలి ఉన్న వారితో నామినేషన్ వేయించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా హుజురాబాద్‌కు చెందిన ఇల్లందుల రాజేందర్ (ఇ. రాజేందర్) అనే వ్యక్తిని నామినేషన్ వేయాలని టీఆర్ఎస్ నాయకులు సంప్రదించారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈటల రాజేందర్ పేరుతో పోలి ఉన్నందుకే ఈయనతో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బంధువులు అంటున్నారు. నామినేషన్ వేస్తే.. ఇంటి పన్ను చెల్లిస్తాం, వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. గోడౌన్లో హమాలీ పనిచేసే ఇల్లందుల రాజేందర్ చేత నామినేషన్ వేయించాలనుకోవడం వెనక కుట్ర ఉందని వారుంటున్నారు. ఈ విషయంపై ఈసీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇల్లందుల రాజేందర్ బంధువులు విజ్ఞప్తి చేశారు.
For More News..