కామారెడ్డి, వెలుగు : నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు లీడర్లు ప్రచారం షూరు చేయగా, రీసెంట్గా టికెట్వచ్చి, నామినేషన్లు వేసిన వారు యాక్టివ్అవుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్(బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్), వెంకటరమణారెడ్డి (బీజేపీ), ఎల్లారెడ్డిలో మదన్మోహన్రావు (కాంగ్రెస్), జాజాల సురేందర్(బీఆర్ఎస్), వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి(బీజేపీ), జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్), హన్మంత్‌షిండే (బీఆర్ఎస్), అరుణతార (బీజేపీ), బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్), ఏనుగు రవీందర్‌రెడ్డి (కాంగ్రెస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)లతో పాటు, ఇండిపెండెంట్లు బరిలో ఉండనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎవరు బరిలో ఉంటారో తెలుస్తుంది.
అసంతృప్తులతో చర్చలు
ఆయా చోట్ల ప్రధాన పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న లీడర్లతో క్యాండిడేట్లు చర్చలు జరుపుతున్నారు. ఎల్లారెడ్డి టికెట్మదన్ మోహన్‌రావుకు కేటాయించగా వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గం నారాజ్‌గా ఉంది. వీరితో మదన్మోహన్రావు చర్చలు జరిపారు. కొందరు లీడర్లు, కార్యకర్తల ఇండ్లకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరి, ప్రచారానికి వచ్చేలా చేస్తున్నారు. బీఆర్ఎస్అభ్యర్థి జాజాల సురేందర్ కూడా పలువురు లీడర్లతో మాట్లాడి వీరిని యాక్టివ్ చేశారు.
బీజేపీ తరఫున పోటీలో ఉన్న సుభాష్‌రెడ్డి కూడా పలువురిని కలిసి మద్దతు కూడగడుతున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గంగారాం, ఎన్ఆర్ఐ తోట లక్ష్మీకాంత్‌రావు ఆశించగా చివరకు అధిష్టానం లక్ష్మీకాంతారావు వైపు మొగ్గు చూపింది. గంగారం బరిలో ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో లక్ష్మీకాంత్‌రావు గంగారం వర్గంతో చర్చలు జరిపి మద్దతు కోరుతున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బాన్సువాడ టికెట్దక్కించుకోగా, టికెట్ఆశించిన బంగపడ్డ కాసుల బాల్‌రాజు అసంతృప్తితో ఉన్నారు. ఆమరణ దీక్షకు దిగడంతో పాటు, పురుగుల మందు తాగి సూసైడ్అటెంప్ట్ చేశారు. ఈయనతో పార్టీ సీనియర్ లీడర్లు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జోరుగా ప్రచారం..
ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని మమ్మరం చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్పాల్గొన్నారు. ఈ నెల15న ఆయన ఎల్లారెడ్డికి రానున్నారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత శుక్రవారం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన తరఫున ఆ పార్టీ లీడర్లు గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. ఎల్లారెడ్డిలో ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్‌రావు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు తన ప్రచారాన్ని స్పీడప్ చేశారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయా మండలాల్లోని కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో మీటింగ్‌లు నిర్వహించి మద్దతు కోరారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కొన్ని నెలలుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇటీవల స్టేట్ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి ఇక్కడికి వచ్చి కార్యకర్తల్లో జోష్నింపారు. జుక్కల్‌లో అరుణతార చాలా రోజులుగా నుంచి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్ దక్కించుకున్న వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేశారు. బాన్సువాడలో యెండల లక్ష్మీనారాయణ మండలాలు, గ్రామాల వారిగా లీడర్లు, కార్యకర్తలతో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచారానికి సిద్ధమయ్యారు.