మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. షరతులు పాటిస్తేనే ఎంట్రీ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పక్రియ మెదలైంది. దీంతో పోలీసులు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో పాటు అధికారులు కొన్ని షరతులు పెట్టారు. 

జాతీయ రహదారి నుంచి మున్సిపల్ కార్యాలయం మెయిన్ గేట్ వరకు 3 చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలోకి వేళ్లే ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం నుంచే నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. 

నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో వచ్చే అభ్యర్థులు వారి వాహనాలను 200 మీటర్ల దూరంలోనే ఆపేయాలని ఆదేశించారు. ర్యాలీతో వచ్చే వాహనాలు, బానాసంచాలు వంటివి నామినేషన్ ఆఫీస్ ముందు పేల్చకూడదని పోలీసు అధికారులు సూచించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

ALSO READ : ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు : షర్మిల