మునుగోడు బైపోల్ : ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం

మునుగోడు బైపోల్ పోరు రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ తర్వాత 83 మంది అభ్యర్థులు ఉన్నారు. 14 జిల్లాలకు చెందిన 83 మంది నామినేషన్లు వేశారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో క్లారిటీ రానుంది. ఇప్పటికే ఇండిపెండెంట్ భారీగా నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. మునుగోడు బైపోల్ లో 130 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 47 తిరస్కరించారు అధికారులు. ఓట్లు చీలకుండా ఉండేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు.
..
ఇక ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార స్పీడును పెంచారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, గులాబీనేతలు బాధ్యతలను తీసుకుని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్ధతుగా.. ఆయన  సతీమణి లక్ష్మీతో పాటు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. పాల్వాయి స్రవంతికి మద్ధతు NSUI ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం పేరుతో ప్రచారం చేస్తుంది.