సిద్ధయ్య గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ప్రదానం .. అందజేసిన బ్రోమిటోన్ ఇంటర్నేషనల్​ యూనివర్సిటీ

సిద్ధయ్య గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ప్రదానం .. అందజేసిన బ్రోమిటోన్ ఇంటర్నేషనల్​ యూనివర్సిటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సామాజిక సేవకుడు నోముల సిద్ధయ్య గౌడ్..కెనడాకు చెందిన బ్రోమిటోన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. సిద్ధయ్య గౌడ్ పేదలకు చేస్తున్న సాయం, విద్యార్థులకు చేయూతనివ్వడం, వృద్ధులకు ఆసరాగా నిలుస్తుండడాన్ని పరిశీలించిన వర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్​చార్జి ప్రతినిధులు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శివప్ప, సురేశ్​గుప్తా సిద్ధయ్య గౌడ్​కు పట్టాని అందజేశారు. 

సమాజం కోసం సిద్దయ్య గౌడ్ చేస్తున్న కృషిని అభినందించారు. డాక్టర్​నోముల సిద్దయ్య గౌడ్ మాట్లాడుతూ అవార్డులు, రివార్డుల గురించి పట్టించుకోవద్దని, మనం చేస్తున్న సేవే వాటిని మన దగ్గరకు తీసుకువస్తుందన్నారు. తనకు ఇచ్చిన ఈ డాక్టరేట్​తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తోటివారికి సాయమందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు.