
కోల్‌బెల్ట్,వెలుగు:పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, యువతకు భవిష్యత్ ఉంటుందని మందమర్రి పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మందమర్రిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ లీడర్ సొతుకు సుదర్శన్, పార్టీ మండల ప్రెసిడెంట్ నీలయ్య, జిల్లా జనరల్ సెక్రటరీ మండ భాస్కర్‌తో కలిసి మాట్లాడారు. కాకా వెంకటస్వామి కుటుంబం 60ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు.
కాకా, ఆయన కుమారులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి బాటలో మనవడు గడ్డం వంశీకృష్ణ ప్రజాసేవ చేసేందుకు రాజకీయల్లోకి రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. యువకుడు, విద్యావంతుడు, పారిశ్రామివేత్త వంశీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, పెద్దపల్లి లో ఇండస్ర్టీయల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. వంశీని బంపర్ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గందె రాంచందర్, జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మన్, డీసీసీ మెంబర్ బత్తుల రమేశ్, కడారి జీవన్‌కుమార్, ఎస్సీ, మైనార్టీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షుడు నెరువెట్ల శ్రీనివాస్, ఎండి.జమీల్, గడ్డం రజని, సేవాదళ జిల్లా ప్రెసిడెంట్ ఎండి.ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.