పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలపై నాన్ బెయిలబుల్ కేసు

పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలపై నాన్ బెయిలబుల్ కేసు

ఖమ్మం, వెలుగు : పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై హైదరాబాద్​లో భూ కబ్జా కేసు నమోదైంది. షేక్ పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదుతో ఆదివారం బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న 2185 గజాల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కందాల ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరు కలిసి కబ్జా చేసి వైన్ షాప్ కోసం నిర్మాణాలు చేపట్టారు.

విషయం తెలుసుకున్న  షేక్​పేట తహసీల్దార్ అనితారెడ్డి..బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్లు 447, 427,467, 468, 471, సెక్షన్ 3 పీడీపీపీ (ప్రివెన్షన్​ఆఫ్​డ్యామేజ్ ​టు పబ్లిక్​ ప్రాపర్టీ)  చట్టం కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.