ములుగు, వెలుగు : ములుగు మండల కేంద్రంలోని పీహెచ్సీ, మామిడియాల సబ్ సెంటర్ ను బుధవారం నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ వైద్య అధికారులు సందర్శించారు. పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్, బీపీ, షుగర్, టుబాకో, మానసిక రోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆన్ లైన్ లో నమోదు చేసిన పేషెంట్ల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని సెంట్రల్ అధికారులు సేన శర్మ, మార్గె, తరన్నం, సిన్హా, కథేరినే లాల్మ్ నవౌమి, యుగేశ్ కుమార్ రే, అర్జెన్ షేర్పా, అహంతెం విక్టర్ సింగ్, నమిత నీలకంథ్, ఆశిష్, ములుగు స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.