మజగావ్ డాక్ షిప్ బిల్డిండ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 176 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 సెప్టెంబర్ 2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్ ట్రేడుకు గరిష్టంగా 48 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.mazagondock.in వెబ్సైట్లో సంప్రదించాలి.