పనికిరాని పరికరాలు..  కనిపించని సౌలత్‌‌‌‌‌‌‌‌లు.. అధ్వానంగా మారిన గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ పార్కులు

హనుమకొండ, వెలుగు : ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చెట్ల కింద సేదదీరేందుకు, సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు పార్కులకు వెళ్తున్న గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని పార్కుల్లో కనీస సౌలత్‌‌‌‌‌‌‌‌లు లేకపోగా, మరికొన్నింటిలో విరిగిన ఆట వస్తువులు దర్శనమిస్తున్నాయి.

కోట్లాది రూపాయలతో పార్కులను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేస్తామన్న లీడర్లు శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కేటాయించకపోవడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని పార్కుల పరిస్థితి అధ్వానంగా మారింది. 

మూతపడ్డ మ్యూజికల్‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌

వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరంలోని కాకతీయ మ్యూజికల్‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌కు టూరిస్ట్‌‌‌‌‌‌‌‌, షూటింగ్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌గా మంచి పేరుంది. 1995లో 15 ఎకరాల్లో ఏర్పాటైన ఈ గార్డెన్‌‌‌‌‌‌‌‌ దట్టమైన చెట్లు,  వివిధ రకాల మొక్కలు, కళాకృతులు, వాటర్‌‌‌‌‌‌‌‌ఫాల్స్‌‌‌‌‌‌‌‌, డక్‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌తో చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేది. నిత్యం వేలాది మంది ఈ పార్క్‌‌‌‌‌‌‌‌కు వస్తుండడంతో బల్దియాకు ఇన్‌‌‌‌‌‌‌‌కం కూడా వచ్చేది. దీనిని రీ డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఆఫీసర్లు నాలుగేండ్ల కిందట ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశారు.

ఇందులో భాగంగా స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చి రూ.15 కోట్లు కేటాయించారు. కుడా ఆధ్వర్యంలో పనులు చేపట్టగా అవి ఇప్పటివరకు పూర్తి కాలేదు. దీంతో ఆ పార్క్‌‌‌‌‌‌‌‌ నాలుగేండ్ల నుంచి మూతపడే ఉంటోంది. లీడర్లు, ఆఫీసర్లు తరచూ మ్యూజికల్‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌ను సందర్శిస్తున్నా పార్క్‌‌‌‌‌‌‌‌ని తిరిగి ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

బండ్‌‌‌‌‌‌‌‌ పనులూ పూర్తి కాలే

ఓరుగల్లు నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కుడా ఆధ్వర్యంలో భద్రకాళి చెరువుపై బండ్ నిర్మించాలని నిర్ణయించారు. హృదయ్‌‌‌‌‌‌‌‌ స్కీం కింద దాదాపు రూ.30 కోట్లతో మొదటి విడతగా భద్రకాళి కట్టపై 1.1 కిలోమీటర్ల మేర పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక రెండో విడతగా స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రూ.65 కోట్లతో ​2.5 కిలోమీటర్ల మేర డెవలప్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంది. ఈ మేరకు మూడేండ్ల కిందటే పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.

జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. భద్రకాళి బండ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకముందే టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు, ప్రజలపై టికెట్ల భారం వేయడం, కట్టపైకి కనీసం వాకర్స్‌‌‌‌‌‌‌‌ను కూడా అనుమతించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు రూ.21.5 కోట్లతో చేపట్టిన వడ్డేపల్లి చెరువు కట్ట డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

విరిగిన ఆటవస్తువులు

వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరంలో పబ్లిక్‌‌‌‌‌‌‌‌ గార్డెన్‌‌‌‌‌‌‌‌ అత్యంత ప్రధానమైంది. దీనిని రూ.11.5 కోట్లతో డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసి మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభమై ఏడాది గడవకముందే పార్క్‌‌‌‌‌‌‌‌లోని ఆట వస్తువులు, ఊయలలు ఇతర పరికరాలు విరిగిపోయాయి. అలాగే ఏకశిలా పార్కులో కూడా పిల్లలు ఆడుకునే ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సరిగా లేకపోవడంతో పార్క్‌‌‌‌‌‌‌‌కు వచ్చే వారంతా ఖాళీగా కూర్చొని తిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించి పార్కులను డెవలప్‌‌‌‌‌‌‌‌చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.