వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీలో ఫ్రీజర్లు పని చేయడం లేదు. కొంత కాలంగా ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలను ఫీజర్‌లో పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆరుబయటే మృతదేహాలను ఉంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసుపత్రిలోని రోగులు, మృతుల బంధువులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాల నుంచి వచ్చే దుర్వాసనతో రోగులు, కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు.
పేరుకే పెద్దాసుపత్రి, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా..క్షేత్రం స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఎంజీఏం ఆసుపత్రిలో ఫ్రీజర్లు మూలకు పడేయంపై మృతుల బంధువులు మండిపడుతున్నారు. ఫ్రీజర్లపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.