హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. సిటీలో అంతటా చిరు జల్లులు పడుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, మూసాపేట్, అమీర్ పేటలో వర్షం నాన్ స్టాప్ గా కురుస్తోంది. యూసఫ్ గూడ, కార్మిక్ నగర్, ఫిలింనగర్, సుచిత్ర, బాలనగర్, జిడిమెట్ల, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేటలో కూడా వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తోంది. టీలవారుజాము నుండి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి చాలా ఏరియాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read :-బలపడుతోన్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో మూడురోజులు పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమమతంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.