వర్సిటీల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

వర్సిటీల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
  • ఓయూలో నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ధర్నా

ఓయూ, వెలుగు: యూనివర్సిటీల్లో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గురువారం డిమాండ్ డేను ఓయూలో నిర్వహించారు. ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టి మాట్లాడారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న పెన్షన్, హెల్త్ కార్డులను తమకు వర్తింపజేయాలని కోరారు. పెండింగ్​లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగుల పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.