దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: మొత్తం 1377 ఖాళీల్లో ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5, ఆడిట్ అసిస్టెంట్: 12, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 4, లీగల్ అసిస్టెంట్: 1, స్టెనోగ్రాఫర్: 23, కంప్యూటర్
ఆపరేటర్: 2, క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128, ల్యాబ్ అటెండెంట్: 161, మెస్ హెల్పర్: 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.