మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన గిరిజనేతరులు 

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు కొత్తగూడ మండల గిరిజనేతరులు. FRC కమిటీలో తమకు 3 వంతు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.. 1/70చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో 1970 కంటే ముందు నివసించే రైతులకు ROFR పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరుల ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గిరిజనేతరులకు- పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.