తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా చికెన్, మటన్ సేల్స్ బాగా పెరిగాయి. దీంతో మూడు రోజుల సంక్రాంతి పండుగ సందర్భంగా నాన్ వెజ్ కి పెరిగిన డిమాండ్ పెరిగింది. ఈరోజు కనుమ పండుగ కావడంతో చికెన్, మటన్ కొనేందుకు పబ్లిక్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హైద్రాబాద్ లో చికెన్ మటన్ షాప్స్ వద్ద పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటోంది.
ప్రస్తుతం నాన్ వెజ్ ధరలు చూసినట్లయితే కేజి మటన్ రూ. 940, కేజి చికెన్ రూ.230 ఉన్నాయి. అయితే నార్మల్ రోజులకు పోలిస్తే ఫెస్టివల్ కావడంతో నాన్ వెజ్ సేల్స్ డబుల్ అయ్యాయి. దీంతో ఇదే అదునుగా చేసుకున్న దుకాణదారులు పండుగ సాకుతో మటన్ చికెన్ రేట్స్ భారీగా పెంచారు. సంక్రాంతి, దసరా పెద్ద పండుగల సమయంలో ఇదే విధమైన సేల్స్ ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.