తబలా కొట్టి..రికార్డు పట్టి..!

చేర్యాల, వెలుగు: నాన్​స్టాప్​గా ఏడు గంటల పాటు తబలా వాయించి సిద్దిపేట జిల్లాకు చెందిన బండోజు నరసింహాచారి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సాధించాడు. ఆదివారం చేర్యాలలోని అయ్యప్ప టెంపుల్​లో వివిధ భక్తి గీతాలకు నరసింహాచారి 7 గంటల పాటు తబలా వాయించగా.. సంస్థ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, స్వర్ణ శ్రీ ఆయనకు గుర్తింపు సర్టిఫికేట్ అందజేశారు.  టీచర్​గా పనిచేస్తున్న ముస్త్యాల గ్రామానికి చెందిన నరసింహాచారి.. తబలా వాయిద్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అందరి ప్రోత్సాహంతోనే తాను ఈ రికార్డును సాధించానని నరసింహాచారి చెప్పారు.