కేసీఆర్​ను గద్దెదించేందుకు సిద్ధం కావాలి : నూర్జహాన్​

బోధన్, వెలుగు: తమ హక్కుల సాధన కోసం అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశావర్కర్లు రోజుల తరబడి సమ్మె చేస్తున్నా సీఎం  కేసీఆర్ ​పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, కేసీఆర్​ను గద్దెదించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా  కార్యదర్శి నూర్జహాన్​ పిలుపు నిచ్చారు. 

ALSO  READ :-  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు

మంగళవారం బోధన్​ మండలాఫీసు వద్ద సమ్మెలో పాల్గొన్న అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశావర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్​ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. నూర్జహన్​ మాట్లాడుతూ అంగన్​వాడీలు, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సీఐటీయూ లీడర్లు శంకర్​గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.