
మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది నార్త్ కొరియా. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9 క్షిపణి ప్రయోగాలు చేపట్టింది నార్త్ కొరియా. ప్రపంచ దేశాలు అభ్యంతరం తెలుపుతున్నా.. కిమ్ సర్కారు మాత్రం క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మిసైల్ ని సముద్రంలోకి ప్రయోగించినట్లు తెలిపింది సౌత్ కొరియా. మిసైల్ 550 కిమీ (340 మైళ్లు) ఎత్తుకు చేరుకుందని.. 300 కిమీ (190 మైళ్లు) దూరం ప్రయాణించిందని జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి తెలిపారు. గత కొన్ని నెలలుగా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తర కొరియా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9 ప్రయోగాలు చేపట్టింది. అణ్వాయుధాల కట్టడిపై 2019 లో అమెరికాతో జరిపిన చర్చలు విఫలమయ్యాక నార్త్ కొరియా మరింత జోరు పెంచింది . తమ రక్షణ సామార్థ్యాన్ని మరింత బలోపేతం కోసం... ఈ ప్రయోగాలు చేపడుతుంది కిమ్ ప్రభుత్వం.
మరిన్ని వార్తల కోసం..