ప్రపంచంలో మరో యుద్ధం రాబోతుందా.. అది ఉత్తరకొరియా నుంచి ప్రారంభం కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి అంర్జాతీయ మీడియా. రెండు రోజుల క్రితం అంటే.. డిసెంబర్ 27వ తేదీన ఉత్తరకొరియా ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో.. యుద్ధానికి రెడీ అవ్వండి.. యుద్ధ సన్నాహాలు వేగవంతం చేయండి.. విమానాలు, యుద్ధ ట్రక్కులు, రాకెట్లను, సర్వ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి అంటూ.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ స్వయంగా ఆదేశించటం.. ఇప్పుడు ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధంతో మధ్య ఆసియా దేశాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరకొరియా యుద్ధానికి దిగితే.. అది కచ్చింతగా తన ఆగర్భ శత్రువు దక్షిణి కొరియాపైనే ఉంటుంది.. దక్షిణి కొరియాతో యుద్ధానికి కిమ్ దిగితే.. ఆ వెంటనే అమెరికా ఎంట్రీ ఇస్తుంది.. ఈ పరిణామాలే ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్.. ప్రస్తుతం యుద్ధ సన్నాహాల్లో బిజీగా ఉండటమే కాకుండా.. రష్యాకు చాలా దగ్గరగా ఉన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు మద్దతుగా సైనిక సాయం సైతం అందిస్తున్నారని.. ఇప్పటికే అమెరికా ఆరోపిస్తుంది. రష్యాకు అందిస్తున్న సాయంపై.. అమెరికా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే కిమ్.. యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు.. ఏకంగా ఆ దేశ కేంద్ర కమిటీ ప్లీనరీలోనే.. స్వయంగా ప్రకటించటంతో ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తుంది.
ఉత్తర కొరియా కేంద్ర కమిటీ సమావేశంలో అధ్యక్షుడు కిమ్ చేసిన ప్రసంగం సైతం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అణు సామర్థ్యాన్ని మరింత పెంచాలని సైన్యానికి పిలుపునివ్వటం.. మిగతా దేశాలకు కంగారు పుట్టిస్తుంది. ఇప్పటికే కిమ్.. 100 బాలిస్టిక్ ఖండాంతర క్షిపణి ప్రయోగాలను స్వయంగా పర్యవేక్షించాడు. ఇప్పుడు అణు ప్రయోగాలపైనా మాట్లాడాడు.. ఈ క్రమంలోనే పొరుగు దేశం అయిన దక్షిణి కొరియా అప్రమత్తం అయ్యింది. కిమ్ ఏ మాత్రం రెచ్చగొట్టినా.. యుద్ధానికి కాలుదువ్వితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
పదేళ్లుగా కిమ్ ఇలాంటి ప్రయోగాలు చేయటం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం.. యుద్ధ సన్నాహాలు చేయటం కామన్ ... మరి ఈ సారి కూడా మాటలకే పరిమితం అవుతాడా లేక యుద్ధానికి నిజంగా దిగుతాడా అనేది చూడాలి...