ఉత్తర కొరియా ఆ దేశ రెండవ మిలటరీ స్పై శాటిలైట్ ప్రయోగించడానికి షెడ్యూల్ ప్రకటించింది. లుజోన్ ద్వీపానికి తూర్పున సముద్రంలో ఈ ప్రాజెక్ట్ రాకెట్ లాంచింగ్ చేయనుంది. ఉత్తర కొరియా జూన్ 3 అర్థరాత్రి ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తున్నట్లు జపాన్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి. సౌత్ కొరియా 2023 నవంబర్ లో తన మొదటి స్పై శాటిలైట్ చొల్లిమా-1 రాకెట్ ద్వారా మల్లిగ్యాంగ్-1 ని నింగిలోకి పంపింది. శాటిలైట్ ప్రయోగాలు చేయోద్దని ఉత్తరకొరియాపై నిషేద ఆజ్ఞలు ఉన్నా రెండవ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించి కొరియా శత్రు దేశాలపై నిఘూ పెంచునుంది.
దీనికి వ్యతిరేకంగా శాటిలైట్ లాంచింగ్ ను ఆపివేయాలని అమెరికా, దక్షణ కొరియా, జపాన్ దేశాలు హెచ్చరించాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను మందలించారు. UN ఉత్తర కొరియా ఎటువంటి ఉపగ్రహ ప్రయోగాలను నిర్వహించకుండా నిషేధించింది. యుద్ధం సమయంలో సంసిద్ధత గురించి స్పై శాటిలైట్ పనిచేస్తుంది.శుత్రువుల ప్రమాదకర కదలికలపై నిఘా ఉంచుతుంది. దక్షిణ కొరియాతో పాటు ఇతర ప్రదేశాలను మానిటర్ చేసేందుకు స్పై శాటిలైట్లను ప్రయోగిస్తోంది.