ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నాన్నమ్మపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన మాన్షన్ ను బుల్డోజర్లతో కూలగొట్టాడు. ఆమె వారసులు తన పదవికి అడ్డు వస్తారనే ఈ చర్యలకు ఉపక్రమించాడు. దేశ రాజధానికి సమీపంలోని పర్వతాల మధ్య అటవీ ప్రాంతంలో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. దీని సమీపంలో కృత్రిమంగా నదిని సైతం తవ్వించారు.
ప్రస్తుతం మ్యాపులో ఈ ప్యాలెస్ నామరూపాల్లేకుండా పోయింది. కాగా, కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ మొదటి భార్య కుమారుడి వారసుడే కిమ్ జోంగ్ ఉన్. భార్య మరణించడంతో ఇల్ సంగ్ రెండో పెండ్లి చేసుకొన్నాడు. ఆమె పేరు కిమ్ సంగ్ ఏ. ఆమె తన సొంత కొడుకును గద్దెనెక్కించేందుకు ప్రయత్నించడంతో రాజ కుటుంబీకుల మధ్య వైరం మొదలైంది.