ఉత్తర కొరియా ప్రజలు ఆంక్షల వలయంలో బతుకీడుస్తుంటారు. ఆ దేశ ప్రజలకు ఆంక్షలు అలవాటైపోయిన పరిస్థితి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఉత్తర కొరియా సైన్యం పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. ఆ ఆంక్షలను కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేస్తుంది. తాజాగా ఉత్తర కొరియా సైన్యం గురించి అంతర్జాతీయ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా కొంతమంది సైనికులను ఉక్రెయిన్పై యుద్ధం చేయమని రష్యాకు పంపింది. ఇలా వెళ్లిన ఉత్తర కొరియా సైనికులకు అపరిమిత ఇంటర్నెట్ సదుపాయాన్ని రష్యా కల్పించింది.
ఇంకేముంది.. ఉక్రెయిన్పై యుద్ధానికి పంపిన సైనికులు రష్యా ఇచ్చిన అన్ లిమిటెడ్ ఇంటర్నెట్తో కామోద్రేకాన్ని తీర్చుకుంటున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేయమని ఈ ఉత్తర కొరియా సైనికులను పంపితే ఇంటర్నెట్ను వాడుకుని పోర్న్ వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారని ‘ది ఫైనాన్షియల్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది.
రష్యాలో ఇంటర్నెట్ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాదాపు 10 వేల నార్త్ కొరియన్ ట్రూప్స్ను ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా పంపింది. రష్యా వీరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడంతో యుద్ధం చేస్తున్న సైనికులు పోర్న్కు బానిసలుగా మారారని అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి.
యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేయడం కంటే ముందు ఉత్తర కొరియా సైనికులు పోర్న్ భూతం బారిన పడ్డారని ‘ది న్యూయార్క్ పోస్ట్’ (The New York Post) రిపోర్ట్ చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేయమని కిమ్ జాంగ్ ఉన్ 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాకు పంపింతే వారంతా పోర్న్కు బానిసలుగా మారడం రష్యాను కలవరపాటుకు గురిచేస్తుందని అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అయితే ఈ వార్తలను పెంటగావ్ ధ్రువీకరించలేదు.