పోలీసులపై రాళ్లు, చెప్పులు, కూర్చీలతో దాడి చేశారు : డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్

పోలీసులపై రాళ్లు, చెప్పులు, కూర్చీలతో దాడి చేశారు : డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్

సికింద్రాబాద్: ముత్యాలమ్మ తల్లి దేవాలయం దగ్గర జరిగిన లాఠీ చార్జ్ పై నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హిందు సంఘాలు శనివారం శాంతియుత బంద్ కు పిలుపునిచ్చారు. 3000 మంది పబ్లిక్ తో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో రెండు గ్రూపులు గా విడిపోయి ఒక గ్రూప్  హోటల్ దగ్గర, మరో గ్రూప్ దేవాలయం దగ్గర గుమిగూడారని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. 

ALSO READ : హైదరాబాద్‌లో పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే!

ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఉన్న ఆందోళనకారులు దగర్లో ఉన్న మజీద్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడున్న పోలీసులు ఎంత సర్ది చెప్పిన హిందు సంఘాల కార్యకర్తలు వినలేదు. కాలనీవాసులు వారికి సపోర్టు చేశారు. అదేసమయంలో కొంత మంది యువకులు పోలీస్ ఫోర్స్ పై రాళ్లు, చెప్పులు, కుర్చీలతో దాడి చేయడం ప్రారంభించారు. సుమారు 12  మంది పోలీస్ సిబ్బంది గాయాలయ్యాయి. పరిస్థితి కంట్రోల్ చేయడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు. లాఠీ ఛార్జ్ పై సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని.. ప్రజలకు వాస్తవాలు తెలియడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ స్పష్టంగా వివరించారు.