రాత్రి పూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ..14 మంది అరెస్ట్

రాత్రి పూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ..14 మంది అరెస్ట్

సికింద్రాబాద్లో రాత్రిపూట కాపర్ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను  నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 10 లక్షల విలువైన 120 కేజీల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు.

నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం  ..  సికింద్రాబాద్ పరిధిలో  నాలుగు చోట్ల కాపర్ కేబుల్ వైర్లు  చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎస్ఎన్ఎల్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని 200 సీసీ కెమెరాలను పరిశీలించారు.  సీసీ కెమెరాలో లభించిన ఆధారంగా 14 మంది నిందితులను అదుపులో తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. రాత్రి సమయంలో కంపెనీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ కేబుల్ వైర్ మరమ్మతుల పేరుతో కట్ చేసిన కేబుల్ వైర్లు దొంగిలిస్తుంది ముఠా. 

Also Read :- తెలంగాణకు తప్పిన గండం 

పలు కంపెనీల నుంచి కేబుల్స్ ఇన్ స్టాల్   చేసే కాంట్రాక్ట్ లేబర్స్  చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు..ఎక్కడెక్కడ అయితే ఇన్ స్టాల్ చేశారు, ఆయా ప్రాంతాల్లో కాపర్ వైర్లను దొంగిలించి అమ్మకాలు జరుగుతున్నట్లు విచారణలో తేలింది.  నిందితుల నుంచి పది లక్షల రూపాయల విలువగల కేబుల్ వైర్లను, ఓ ఆటో రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మీడియాకు తెలిపారు.